ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ద రాజా సాబ్’ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. తొలుత ఏప్రిల్ 10, 2025న విడుదల చేయాలని భావించినా, తాజాగా చిత్రం వాయిదా పడింది. కారణం? మూవీకి సంబంధించిన CG (విజువల్ ఎఫెక్ట్స్) పనులు ఇంకా పూర్తవ్వలేదని సమాచారం.
ఇటీవల దర్శకుడు మారుతి సోషల్ మీడియా ద్వారా టెంపుల్ ఫోటో షేర్ చేయడంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? రిలీజ్ ఎప్పుడు? అనే ప్రశ్నలతో కామెంట్స్ కురిపించారు. ఒక అభిమాని “మీరు సంతృప్తి చెందాకే విడుదల చేయండి, కానీ క్లారిటీ ఇస్తే చాలంతే” అన్న కామెంట్‌కు మారుతి స్పందిస్తూ, “ఇది ఒక వ్యక్తి మాట మీద జరిగే పని కాదు. పూర్తిగా CG పనులు వచ్చిన తర్వాతే మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటిస్తారు,” అన్నారు.
చిత్రం షూటింగ్ దశలో చివరి దశకు చేరుకుంది. కేవలం కొంత టాకీ భాగం, పాటలు మిగిలే ఉన్నాయి. పాటలు అభిమానులకు మంచి వినోదాన్ని ఇస్తాయని మారుతి హామీ ఇచ్చారు.
మలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా, సంజయ్ దత్ కీలక విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ హారర్ కామెడీ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీగా ఈ సినిమా నిర్మిస్తోంది.
ప్రభాస్ గత సినిమాల స్థాయిని దాటించేలా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు మారుతి చెప్పడంలో సందేహమేలేదు. విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాకపోయినా, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.



